పులివర్తి నాని నటనకు నంది అవార్డు ఇవ్వాలి 

– చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 

తిరుపతి, మహానాడు:  నాని వ్యాపారాల కోసం నాతో పాటు, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వాడుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పదవులు పొందాలని చూస్తున్నారని, చంద్రబాబు నంది అవార్డు ఇస్తే పులివర్తి నాని నటన కు ఇవ్వాలని ఎద్దేవా చేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల కౌంటింగ్ అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన దాడుల పై మీడియాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…  తమ నియోజకవర్గంలో గడిచిన 50 రోజుల్లో 34 మంది వైసీపీ నేతల పై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. తాను 10 ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే  పులివర్తి నాని పై ఒక్క కేసు కూడా పెట్టలేదని నానికి చెందిన క్వారీ పై రైడ్ లు జరిగిన సమయంలో తాను మైనింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేసి రైడ్ లు ఆపించానని గుర్తు చేశారు.

కౌంటింగ్ సమయంలో నాని నాటకాల కారణంగా ఎస్పీలు, డీఎస్పీ, సీఐలు  సస్పెండ్ అయ్యి రోడ్డున పడ్డారని, ఇప్పుడు పోలీసుల సంఘం ఏం పీకుతొందని మండిపడ్డారు. ఓడిపోతే నా శవం చూస్తారని, ఇంటింటికీ వెళ్లి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి గెలిచారని ఆరోపించారు.