అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత లు హాజరవుతున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం లో ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నేతలు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఏర్పాట్లు పరిశీలించారు.
ఎయిర్ పోర్ట్ అథారిటీ తో బిజెపి అగ్రనేతలు సిద్దార్థ్ నాథ్ సింగ్, దగ్గుబాటి పురంధేశ్వరి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్,కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి , అధికార ప్రతినిధి యామినీ శర్మ తదితరులు పాల్గొన్నారు.