చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈపూరివారిపాలెం వద్ద ఘోర రోడ్డుప్రమాదం లో ఆరుగురు మృతిచెందడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరు గైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చినగంజాం నుంచి ఓటు వేసి తిరిగి హైదరాబాద్‌కు ట్రావెల్ బస్సులో ప్రయాణీకులు బయలుదేరగా ఈపూరివారి పాలెం సమీపంలో ఆ బస్సును లారీ ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని కోరారు.