రోడ్డు ప్రమాద బాధితులకు పురందేశ్వరి సాయం

రాజానగరం, మహానాడు: రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి వంద మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా అటు వైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తో కలిసి ప్రయాణిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. తన కారును ఆపించి బాధితురాలితో స్వయంగా మాట్లాడారు. అనంతరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యం కు ఆదేశించారు.