Mahanaadu-Logo-PNG-Large

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణం మహానాడు :  కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం నందిగామ ఓసి క్లబ్ లో జరిగిన నందిగామ, తిరువూరు డివిజన్ స్థాయి అన్ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్ల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కొత్త ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు. కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా ఫలితాలు సాధించాలని సూచించారు. త్వరలో మరోసారి విద్యాశాఖ అధికారులు, పాఠశాలల కరస్పాండెంట్లతో కలిసి కూలంకషంగా సమీక్షిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ తిరువూరు డివిజన్లకు సంబంధించిన ఎంఈఓలు, పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.