ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి పెద్ద ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా BRS హయాంలో టాస్క్ ఫోర్స్ మాజీ DCP ప్రభాకర్ అధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.