గుంటూరు, మహానాడు: వరద బాధితులను ఆదుకోవడంలో పెమ్మసాని చంద్రశేఖర్ స్ఫూర్తితో పలువురు దాతలు స్పందిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. గుంటూరుకు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సత్యనారాయణ మూర్తి, ఆయన కుటుంబీకులు కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. లక్ష ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి ఆదివారం అందించారు. వరద బాధితులకు సహకారం అందించిన సత్యనారాయణ మూర్తి కుటుంబాన్ని పెమ్మసాని అభినందించారు.