Mahanaadu-Logo-PNG-Large

తమిళనాడులో వర్షాలు..రెడ్‌ అలర్ట్‌ జారీ

తమిళనాడు, మహానాడు : తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య ఆ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కన్యాకుమారి, టెన్‌ కాశీ, కోయంబత్తూరు, తంజావూర్‌, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్‌, నీలగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.