విజయవాడ: పడమట విజయవాడ కృష్ణ లంక 16వ డివిజన్ పరిధిలో రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో వరద బాధితులకు సాయంత్రం ఆహారం పంచేందుకు మంత్రి టీమ్ (రాముడు టీమ్) సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆహారం కోసం వేచి ఉన్న వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి కాలనీలో టీమ్ సభ్యులు చేరుకొని ఎక్కడిక్కడ వేగంగా ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. రాముడు టీమ్ సభ్యులు అందిస్తున్న సహాయ పట్ల డివిజన్ పరిధిలోని హర్షం వ్యక్తంచేశారు.