ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను ఆకస్మిక తనిఖీ

మహానాడు, గుడివాడ: గుడివాడ ఏరియా వైద్యశాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు తలెత్తితే… ప్రజా వేదికలో ఫిర్యాదు చేయాలంటూ రోగులు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ముందుగా హాస్పిటల్‌ ఓపి రిజిస్టర్‌ తనిఖీ చేసిన ఎమ్మెల్యే సక్రమంగా మందులు అందుతున్నాయా లేదా అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ హాస్పిటల్లో ఇటీవల గర్భిణి మృతి చెందడంతో.. ఆ విషయం వైద్యుల వివరణను ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు. గైనకాలజిస్ట్‌ వార్డులో అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించి. పరీక్షలు చేయించుకునేందుకు హాస్పిటల్‌కు వచ్చిన గర్బిణులతో మాట్లాడారు. హాస్పటల్లో ఉన్న పూర్తిస్థాయి సమస్యలను లిఖితపూర్వకంగా రాసి తను దృష్టికి తీసుకువస్తే…. పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సూపరిండెంటెంట్‌ ఇందిరా దేవితో ఎమ్మెల్యే రాము అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.