Mahanaadu-Logo-PNG-Large

గుండె లోపల ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అమర్చిన జీజీహెచ్

గుంటూరులో అరుదైన ఆపరేషన్

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ పర్యవేక్షకులు కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో మాట్లాడుతూ.. అమలాపురానికి చెందిన ఆనంద్కు గుండెకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అనే ఆధునిక పరికరాన్ని గుండె లోపల అమర్చినట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులు శ్రీకాంత్ బృందానికి అభినందనలు తెలిపారు.