ముంబై: పార్సీ సమాజానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారమే నిర్వహించారు.. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
సాయంత్రం 4 గంటలకు ముంబై లోని వర్లీ విద్యుత్ శ్మశాన వాటికలో రతన్ టాటా అత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో పూర్తి చేసింది. ఆయన అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, దిగ్గజ వ్యాపారవేత్తలు పాల్గొని వీడ్కోలు పలికారు.