– బీజేపీ ఘన నివాళి
విజయవాడ, మహానాడు: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇక లేరన్న విషయం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది… దేశం సేవలో పరితపించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పలువురు రాష్ట్ర నేతలు గుర్తు చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ రతన్ టాటా చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ దేశంలో ఏ విపత్తు ఏర్పడినా దేశ ప్రజలను ఆదుకోవడానికి రతన్ టాటా ముందు వరుసలో ఉండేవారు. ఎన్టీఆర్ జిల్లాకు కూడా ప్రత్యక్షంగా నిధులు ఇచ్చిన రతన్ టాటాకు ఈ జిల్లా రుణపడి ఉందన్నారు. భారత దేశం విలువలతో కూడిన పారిశ్రామిక దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారులు మొగళ్ళ నాగేంద్ర, కందుకూరి సత్యనారాయణ, సీనియర్ నేత మువ్వల వెంకట సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.