– మంత్రి జనార్దన్ రెడ్డి
అమరావతి, మహానాడు: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణంపై రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటు. విలువలు, విశ్వసనీయత, మానవత్వం కలబోసిన మహానీయుడు రతన్ టాటా.. ఆదర్శప్రాయుడైన రతన్ టాటా జీవితం యువతకు మార్గదర్శకం, అనుసరణీయం.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.