ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్‌

అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో భారీ పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.3 శాతం పోలింగ్‌ నమోదైంది. పోస్టల్‌ బ్యాలెట్లతో కలుపుకుంటే ఇది 83 శాతం దాటే అవకాశం ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్‌ కొనసాగింది. 2019లో 79 శాతం పైనే నమోదు కాగా ఈసారి 83 శాతం దాటే అవకాశం కనిపిస్తుండటంతో పెరిగిన ఓటింగ్‌ ఎవరికి అనుకూలమో ఆయా పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఆయా జిల్లాలో పోలింగ్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

కోనసీమ జిల్లా 83.19
అల్లూరి జిల్లా 63.19
ఏలూరు జిల్లా 83.04
సత్యసాయి జిల్లా 82.77
చిత్తూరు జిల్లా 82.65
ప్రకాశం జిల్లా 82.40
బాపట్ల జిల్లా 82.33
కృష్ణా జిల్లా 82.20
అనకాపల్లి జిల్లా 81.63
పశ్చిమగోదావరి జిల్లా 81.12
నంద్యాల జిల్లా 80.92
విజయనగరం జిల్లా 79.41
తూర్పుగోదావరి జిల్లా 79.31
అనంతపురం జిల్లా 79.25
ఎన్టీఆర్‌ జిల్లా 78.76
కడప జిల్లా 78.72
పల్నాడు జిల్లా 78.70
నెల్లూరు జిల్లా 78.10
తిరుపతి జిల్లా 76.83
కాకినాడ జిల్లా 76.37
అన్నమయ్య జిల్లా 76.12
కర్నూల్‌ జిల్లా 75.83
గుంటూరు జిల్లా 75.74
శ్రీకాకుళం జిల్లా 75.41
మన్యం జిల్లా 75.24
విశాఖ జిల్లా 65.50