జోరుగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు

– ఎమ్మెల్యే చదలవాడ నమోదు కేంద్రాల పరిశీలన

నరసరావుపేట, మహానాడు: పట్టణంలో 18వ వార్డు, 24వ వార్డుల్లో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే అరవింద బాబు పరిశీలించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి వార్డుల్లో, గ్రామాల్లో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ను ఓటరుగా నమోదు చేయించుకునే బాధ్యత ప్రతి ఎన్డీఏ కూటమి నాయకుడు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి రావేళ్ల పెద్ద నాగేశ్వరావు, వేల్పుల సింహాద్రి యాదవ్, కనుమూరి రమేష్, వాసిరెడ్డి రవీంద్ర, కనుమూరి లక్ష్మి, నారాయణ సింగ్, సంజీవరావు, బాషా, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.