ఈ నెల 20 నుంచి కొత్త ఓటర్ల నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి బీఎల్ఓ లు ఇంటింటి సర్వేను నిర్వహించ నున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.