సీబీఐ కోర్టులో జగన్‌కు ఊరట

ఢిల్లీ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతిస్తూ తీర్పు చెప్పింది. జగన్‌ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని గతంలో కోర్టును కోరారు. దీనిపై మంగళవారం విచార ణ జరగ్గా ఈ నెల 17 నుంచి జూన్‌ 1 వరకు యూకే వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.