హైదరాబాద్ మాదాపూర్లో నటుడు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. కాగా, ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు, సిబ్బంది నేలమట్టం చేశారు.