Mahanaadu-Logo-PNG-Large

వీధి దీపాలను తక్షణమే బాగుచేయించండి

48 గంటల్లో కార్యాచరణ ప్రణాళిక
అవసరమైన మెటీరియల్‌కు ప్రతిపాదనలు
తాగునీటి రిజర్వాయర్లను శుభ్రం చేయండి
కలుషిత నీటి సరఫరా ఫిర్యాదులపై స్పందించండి
పూడికతీత ఫొటోలను గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలి
గుంటూరు కమిషనర్‌ చేకూరి కీర్తి ఆదేశం
నగర సమస్యలపై అధికారులతో సమీక్ష

గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్నీ వెలిగేలా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలకు సంబంధించి ప్రజల నుండే అందే ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కరించేలా ఇంజినీరింగ్‌ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవా లని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్‌ చాంబర్‌లో నగరంలో వీధి దీపాలు, తాగునీటి సరఫరా, అవుట్‌ ఫాల్‌ డ్రైన్లలో పూడికతీత పనులు తదితర అంశాలపై ఎస్‌ఈ, ఈఈలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వీధి దీపాల మరమ్మ తులకు అవసరమైన మెటీరియల్‌ కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి ఎస్‌ఈ క్షేత్ర స్థాయిలో పరిశీలించి తమకు పంపాలన్నారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో అందే ఫిర్యాదులు, వాటి వివరాలపై ప్రతిరోజు తమకు నివేదిక ఇవ్వాలని సూచించారు.

నగరంలో ప్రతి రిజర్వాయర్‌ నిర్దేశిత షెడ్యూల్‌ మేరకు శుభ్రం చేయాలని, తాగునీటి సరఫరాలో కలుషిత నీటి సరఫరాపై అందే ఫిర్యా దుల పట్ల తక్షణ స్పందన ఉండాలన్నారు. ఏఈల వారీగా ఎమినిటి కార్యదర్శు లు తాగునీటి సరఫరా సమయాల్లో శాంపిల్స్‌ తీసి గ్రూప్‌లో పోస్ట్‌ చేయాల న్నారు. ప్రస్తుతం వర్షాల సీజన్‌ ప్రారంభమైనందున నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలోని ప్రధాన అవుట్‌ ఫాల్‌ డ్రైన్లలో జరుగుతున్న పూడికతీత పనులను ఈఈలు నేరుగా పరిశీలిం చాలన్నారు. పూడిక సక్రమంగా తీసేలా పూడిక ముందు, తర్వాత ఫొటోలు గ్రూప్‌లో పోస్ట్‌ చేయాలని సూచించారు. పూడిక తీసే ప్రాంతాల్లో ఏమైనా ఆక్రమణలు ఉంటే పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ శ్యామ్‌ సుందర్‌, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.