జైళ్ళను మరమ్మతు చేయండి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌, మహానాడు: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలమైన జైళ్ళను మరమ్మతు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మగ్ధుమ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హైడ్రా చర్యల వల్ల సంపన్నులు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడి తో రేవంత్ రెడ్డి అయిన జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది… ప్రధాని గా మోడీ అయ్యాక నేను సన్యాసిని.. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారు… అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వల్లే… మోడీ దయ వల్ల అదానీ పెరిగారు. ఆయన సొంతంగా ఎదగలేదు…. సెబి కూడా అదానీ కి దాసోహం అయ్యింది… పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి.సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలకు జాతీయ సీపీఐ పిలుపు ఇచ్చింది.

కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద గవర్నర్.. విచారణ చేయవచ్చు… గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్… కేంద్రం గవర్నర్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బకొట్టలని చూస్తున్నారు.. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారు… ఆర్‌ఎస్‌ఎస్‌ మోడీని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఎన్ కన్వెన్షన్ ను పరిశీలించాం… కేసిఆర్ ఎన్-కన్వేషన్ విషయంలో బుసకొట్టి ఊరుకున్నారు… గతంలో ఫిరంగి నాల కబ్జా అవుతుంటే పాదయాత్ర చేసి.. ఫిర్యాదులు అందించాం… ట్రాఫిక్ నుంచి హైదరాబాద్ బయటపడాల్సిన అవసరం ఉంది.. హైడ్రా పని తీరు అభినందనీయం… ప్రభుత్వ భూమి నోటరీ పద్ధతుల్లో కూడా కొందరు అమ్మకాలు చేశారు… ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయాలి.

రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారు. మధ్యలో ఆపేస్తే.. పులి తినేస్తుంది…. నాగార్జున బఫర్ జోన్ లో.. కాదు ఎఫ్‌టీఎల్‌ లోనే నిర్మాణం చేశారు. ఎంఐఎం చెబుతున్నట్టు ప్రభుత్వ ఆఫీస్ లు కూల్చేస్తారా అంటున్నారు.. దానిమీద రేవంత్ రెడ్డి అఖిల పక్ష సమావేశం పెట్టాలి. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.. వాటితో ప్రైవేటు నిర్మాణలు పోల్చడం తప్ప.. సాకుగా చూపి ప్రయత్నమే.