(వాసు)
మంగళగిరి, మహానాడు: వీధి కుక్కలతో మంగళగిరి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నిడమర్రు రోడ్డు వద్ద గల అరవింద స్కూల్ గేటు దగ్గర స్కూలుకు వెళ్లి వచ్చే సమయంలో పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోడ్లపై గుంపులు, గుంపులుగా సంచరిస్తూ పాదచారులను ద్విచక్ర వాహనదారులపై దాడి చేస్తున్నాయని నగరవాసులు భయందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు చిన్న చిన్న గల్లీ రోడ్లలో అధికంగా ఉంటూ వీటి చూసి భయపడుతున్న చిన్నారులను వెంటబడి కరుస్తున్నాయి దీంతో నగరంలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆత్మకూరు ప్రాంతంలో చిన్నారులను కరవడం వల్ల ఆస్పత్రి పాలై చికిత్స పొందాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
మంగళగిరి బాప్టిస్ట్ పేట, భార్గవ్ పేట, పాత మంగళగిరి, కొత్తపేట, బ్యాంక్ కాలనీ, పార్క్ రోడ్డు, ద్వారకా నగర్, ఇందిరా నగర్, పాత మంగళగిరి, మంగళగిరి నగరంలోని అన్ని ప్రాంతాలలో గుంపులు గుంపులుగా వీధి కుక్కలు రోడ్డుపైకి చేరి అరవటం, పోట్లాటుకుంటూ అదే సమయంలో పాదచారులు మోటార్ బైక్ పై వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.