100 రకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాద

(వెంకటాచారి)

కాకినాడ: ఆషాడం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు చేసి పెట్టిన అత్తామామలు.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్న కుమారికి కాకినాడకు చెందిన రవి తేజకు గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది.

వివాహమై ఆషాడ మాసం ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో తొలిసారిగా అత్త వారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. అత్తగారు 100 రకాల పిండి వంటలు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.