కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియ పునఃప్రారంభం

– హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్‌

అమరావతి, మహానాడు: అర్ధాంత‌రంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్ర‌క‌టించిన‌ హోం శాఖా మంత్రి వంగలపూడి అనితకి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష త‌రువాత రిక్రూట్మెంట్ రెండో దశలో జ‌ర‌గాల్సిన‌ శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాల‌తో వాయిదా ప‌డ‌టం వ‌ల్ల తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను `ప్ర‌జాద‌ర్భార్‌`కు వ‌చ్చిన నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరి విన‌తిని ప‌రిశీలించాల‌ని హోం మంత్రి గారికి పంప‌గా, వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్ర‌క్రియ‌లో త‌రువాత ద‌శ‌లు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇది కానిస్టేబుల్ అర్హ‌త ప‌రీక్ష పాసైన నిరుద్యోగుల‌కు చాలా సంతోష‌క‌ర‌మైన స‌మాచారమని మంత్రి నారా అన్నారు.