హైదరాబాద్: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఈ వేడుకలను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హాజరుకానున్నారు.