రేవంత్‌ ఒక ఫేక్‌ ముఖ్యమంత్రి

ఐదు నెలల్లో అప్పులతో సంక్షోభం
కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మహానాడు : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 370, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి హామీలను, దేవళ్లపై పెట్టిన ఒట్టును ప్రజలు ఏ మాత్రం విశ్వసించలేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోవాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని వివరించారు. అయితే రాష్ట్రాన్ని మరింత అప్పులకుప్పగా మార్చి తెలంగాణను సంక్షోభంలోకి నెట్టబో తున్నారని ఘాటుగా స్పందించారు.

ఐదు నెలల్లో రూ.16 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని మరింత అప్పులకుప్పగా మార్చారని, విద్యుత్‌ కోతలు, నీటి కొరత, సాగునీటి రంగాలపై స్పష్టత లేకుండా పాలన జరుగుతోందన్నారు. సీఎం రేవంత్‌ సైతం కేసీఆర్‌ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాదు.. కాంగ్రెస్‌ నేతలే తిరగబడుతారని లక్ష్మణ్‌ హెచ్చరించారు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ చచ్చిన పాములా మారిందని విమర్శించారు. డిపాజిట్లు దక్కడమే గగనమని తెలిపారు. భవిష్య త్తులో కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడం ఖాయమన్నారు. తెలంగాణ వచ్చినప్పుడే బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్‌ కుటుంబంతో కలిసి సోనియా గాంధీ కాళ్ల ముందు మోకరిల్లిన సంగతిని గుర్తు చేశారు. రిజర్వేషన్ల విష యంలో కాంగ్రెస్‌ అబద్ధాలు ప్రచారం చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ పార్టీని విశ్వసించ లేదన్నారు. ఫేక్‌ వీడియో తయారుచేసిన రేవంత్‌ రెడ్డి ఫేక్‌ సీఎం అని ఎద్దేవా చేశారు.