– సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు
హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని, చెరువుల ఆక్రమణలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలని, చెరువుల పునరుద్ధరించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆయన మగ్దూం భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఐపిఎస్ రంగనాథ్ మంచి మనిషి…పనిలో స్పీడ్ ఉంది… చెరువు శికం భూమి లో పర్మిషన్ ఇచ్చిన అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకోవాలి.. హైదారాబాద్ జంట నగరాల పరిధిలో ఎన్ని చెరువులు కబ్జా లు అయ్యాయి లిస్ట్ హైడ్రా విడుదల చేయాలి… కవిత విడుదల ను రాజకీయం చేస్తున్నారు.. కవిత ఆడపిల్ల..ఆమె తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఆమెకు బెయిల్ రావడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు.. ఆడపిల్ల మీద అంత కక్ష ఎందుకు? రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే కెసీఆర్ తో చూసుకోండి ఆమెపై రాజకీయం ఎందుకు.. రుణమాఫీ విషయంలో పట్టింపులు ఎందుకు.. ఇచ్చినవి ఇచ్చాము అని చెప్పండి ఇవ్వనివి లేదు అని చెప్పండి.. రేషన్ కార్డు నిబంధన ఎందుకు, చిన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి రుణమాఫీ చేయరా… ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు అందరికీ రుణమాఫీ చేయాలి. సెప్టెంబర్ 17 ను అధికారికంగా గుర్తించాలి… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు… ముస్లిం, హిందువుల మధ్య జరిగిన ఘర్షణ కాదు… సెప్టెంబర్ 17 ను అధికారికంగా చేస్తే ముస్లింలు వ్యతిరేకించరు… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలి. ఆర్‌ఎస్ఎస్‌కు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు సంబంధం లేదు…