Mahanaadu-Logo-PNG-Large

రేవంత్‌ నోటి దురద తగ్గించుకో…

హామీలకు నిధులెలా తెస్తారు?
బీఆర్‌ఎస్‌తోనే రైతు సమస్యలు
బీజేపీ నేతలు కె.ఎస్‌.రత్నం, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రత్నం మాట్లాడుతూ కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలను ఇస్తుంది. వాటి అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో ప్రజలకు చెప్పాలి. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ లేకుండా కాంగ్రెస్‌ పాలన ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కేసీఆర్‌ లాగే రేవంత్‌ అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. తిట్లు మానేసి మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని హితవుపలికారు. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యతగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారని, ఆర్థిక పరిస్థితి తెలుసుకుని రేవంత్‌ హామీలు ఇస్తే బాగుంటుందని అన్నారు.

గ్యారంటీలు కేంద్రం నుంచి వచ్చిన హామీలు…మీరు 5 కిలోలు ఇస్తే మేం 10 కిలోలు ఇస్తాం అనడం నాలెడ్జ్‌ లేని నాయకుడిగా ఖర్గే మాట్లాడుతున్నారు. అవసరం లేనిది ఎక్కువ ఇచ్చి ఏమి చేసుకుంటారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీలు ఇవ్వలేదు. 2047ను దృష్టి పెట్టుకుని బీజేపీ ముందుకువెళుతుందని తెలిపారు. రైతు సమస్యలు బీఆర్‌ఎస్‌ పాలనలో మొదలయ్యాయని, ఆ పార్టీకి రైతు సమస్యలపై ఆందోళనలు చేసే నైతిక హక్కు లేదని హితవుపలికారు.