Mahanaadu-Logo-PNG-Large

మాట తప్పిన రేవంత్‌ క్షమాపణ చెప్పాలి

నీ రాజకీయ ప్రస్థానమే అబద్ధాలపై సాగింది
హరీష్‌రావు మాటకు కట్టుబడిన వ్యక్తి
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద

హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ భవన్‌లో శనివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మీడియా సమావేశంలో మాట్లాడా రు. సీఎం రేవంత్‌ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైందని విమర్శిం చారు. మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌ను రేవంత్‌ స్వీకరించలేకపోతున్నారు. హామీల అమలులో రేవంత్‌ పూర్తిగా వైఫల్యం చెందారని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించా రు. అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు రాకపోతే తన సీటుకు ఎసరు వస్తుందని రేవంత్‌ భయపడు తున్నారు. అందుకే దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు. హరీష్‌రావు రాజీనామా ను ప్రజలు నమ్ముతున్నారు. రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామా పత్రాన్ని తన కిష్టమైన వ్యక్తి దగ్గర పెట్టాలని సవాల్‌ విసిరారు. కొడంగల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజీనామా అన్నా వు. మాట తప్పావు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్‌ వెళ్లేటప్పుడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. స్పీకర్‌కు ఇవ్వలేద న్నారు. హరీష్‌రావు సవాల్‌పై రేవంత్‌ మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.