రేవంత్ చివరి ప్రస్థానం బీజేపీనే

– సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎందుకు భయమో.. దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే, తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షాలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను. అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి? ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.