నెల్లూరు, మహానాడు : నెల్లూరు ఆర్ అండ్ బీఅతిథి గృహంలో శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్.డబ్ల్యూ.ఎస్, ఇరిగేషన్ అధికారులతో కలిసి అదానీ కృష్ణపట్నం పోర్టుతో పాటు పామాయిల్ ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పోర్టు, పామాయిల్ ఫ్యాక్టరీలకు గతంలో జరిగిన నీటి కేటాయింపులపై చర్చించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని తరలించేందుకు చేపట్టాల్సిన పైపులైను నిర్మాణంపై సమీక్షించారు.
అనంతరం ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప వద్ద గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెగా వాటర్ ప్లాంటును వినియోగంలోకి తేవడంపై చర్చింరాఉ. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టడంతో శిథిలావస్థకు చేరిన ప్లాంటు, డిస్ట్రిబ్యూటరీ యూనిట్లు, ట్యాంకర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే సాధ్యాసాధ్యాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదశించారు.