అందరు వెతికేది Exctra income కోసమే. ఇదే బాటలో తెలుగు మహిళ ఫౌజియా జోమోన్ స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టింది . విజయం సాధించింది . స్టాక్ మార్కెట్ అంటేనే నష్టపోతామని భయపడే ఈ రోజుల్లో సరైన అవగాహన- క్రమశిక్షణ ఉంటే దీంట్లో విజయం సాధించడం సాధ్యమే అని నిరూపించిన మహిళ.
ప్రతి మహిళ ఎంత చదువుకున్న అమ్మ అయ్యాక పిల్లల బాధ్యత అనే ఒక్క మెట్టు దగ్గర ఆగిపోతుంది . బయటకు వెళ్ళి ఏమి చేయలేమా అని కృంగిపోతుంది. అటువంటి వారికి సరైన అవగాహనతో మహిళలు ఇంట్లో ఉంటూ, రోజు వారి కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ . ఆర్ధికంగా తమ కాళ్ళ మీద నిలబడవచ్చు అని నిరూపించారు ఫౌజియా.
అంతే కాకుండా ఫౌజియా తన యూ ట్యూబ్ ఛానల్ ఫౌజియా పవర్ పవర్ ఆఫ్ ఏ ఉమెన్ పేరుతో మహిళలకు తమ కుటుంబ భాద్యతలలో అదేవిధంగా కెరియర్ డెవలప్మెంట్ లో, ఒక మహిళ ఎలా రకరకాల పనులను చెయ్యగలదో వివరిస్తూ తను స్వయం గా చేసి చూపిస్తూ, ఎంతో మంది మహిళకు ఆదర్శంగా నిలిచారు. మహిళలు తమ లో ఉన్నా బలాన్ని నమ్మాలి మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమిలేదు. ఉన్నదల్లా సరైన స్కిల్ నేర్చుకొని దానిని డెడికేషన్ తో ఇంప్లిమెంట్ చేస్తే చాలు అంటున్నారు.
స్టాక్ మార్కెట్ గురించి రాబోయే తరాల వారు కూడా తెలుసుకుంటే.. సరైన పద్దతిలో నేర్చుకుంటే, ఆర్ధికంగా ఎంతో ఎదగడం సాధ్యమే అని దానిలో భాగం గా విద్యార్థులకు స్టాక్ మార్కెట్ అవగాహన సెమినార్ కూడా కండక్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు అందులో భాగంగా రోజు స్టాక్ మార్కెట్లో వచ్చే ఒడిదుడుకులు, ఎలా వాటిని క్రమశిక్షణ తో అధిగమించి లాభాలు సాధించవచ్చో వివరిస్తూ, స్వయంగా లాభాల బాటలో ఉన్నారు. ప్రతీ రోజు యూట్యూబ్ లో లైవ్ ట్రేడింగ్ చేస్తున్నారు.ఇలా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఫౌజియా జోమోన్ఇలాగే ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఆశిద్దాం.