Mahanaadu-Logo-PNG-Large

ఎగ్జిట్‌పోల్స్‌పై రోజా స్పందన

తిరుపతి: తిరుమల శ్రీవారిని ఆదివారం నగరి వైసీపీ అభ్యర్థి రోజాతో పాటు నారాయణస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించారు. ఎవరికివారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చినా మరోసారి జగన్‌ సీఎం కావడం ఖాయం. అభివృద్ధికి పట్టంకట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపా రు. మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో జగన్‌కు అండగా ఉన్నారని, జత కట్టినా కూటమి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నార ని, పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో అదే చేశారని వ్యాఖ్యానించారు.