రౌడీయిజం, గంజాయి విక్రయాలు ఆపేయాలి

వచ్చేది కూటమి ప్రభుత్వం..ఉక్కుపాదమే
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని

తెనాలి, మహానాడు : రౌడీయిజాలు, గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం.. అన్యాయం, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి మరో లెక్క. అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్‌ నుంచి గురువారం తన పర్యటన ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి ముందుకు సాగారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపనేని రాజకు మారి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పెమ్మసాని సమక్షంలో చేరికలు

గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన 20 మంది వైసీపీ వార్డు కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, డివిజన్‌ అధ్యక్షులు గురువారం పెమ్మసాని ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు టిడిపి కండువాలు కప్పి పెమ్మసాని ఆహ్వానించారు. డిప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబు ఆధ్వర్యంలో వారు చేరారు.