ఢిల్లీ: అక్టోబర్ నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. అడ్వాన్స్ ఇనిస్టాల్మెంట్ ₹89,086 cr తో కలిపి మొత్తం ₹1,78,173 cr ను పంపిణీ చేసింది.అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ కి ₹31,962cr, బిహార్ కు ₹17,921cr, మద్య ప్రదేశ్ కు ₹13,987cr అందించింది. ఇక ఏపీకి ₹7,211cr, తెలంగాణకి ₹3,745cr రిలీజ్ చేసింది. పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాల మూల ధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి ఈ సాయాన్ని అందించినట్లు పేర్కొంది.