– టీడీపీ ‘దర్శి’ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: పల్లెల ప్రగతి గ్రామసభలతోనే సాధ్యమని, వీటి పురోగతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ముండ్లమూరు మండలం, పూరిమెట్ల, తాళ్లూరు మండలం, గంగవరం, దర్శి మండలం, కొత్తపల్లిలో శుక్రవారం గ్రామ సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో లక్ష్మి పాల్గొని, మాట్లాడారు.
మన పంచాయతీ మన సాధికారికత అనే పేరుతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు ఆమె వివరించారు. పంచాయతీల్లో గ్రామాలు అభివృద్ధి పెంపొందించేందుకే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాలలో కనీసం మౌలిక సదుపాయాలే కల్పన ధ్యేయంగా గ్రామ ప్రజలందరి అభిప్రాయాలను తీసుకొని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లే దిశగా ఈ గ్రామ సభలో నిర్వహిస్తున్నట్టు వివరించారు. గ్రామాల్లో గత ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం లో స్థానిక సంస్థల నిధులు అన్ని దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించి అభివృద్ధి లేకుండా చేశారని దుమ్మెత్తిపోశారు. అందుకే తిరిగి స్థానిక సంస్థల పరిపుష్టికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామీణ రోడ్ల అభివృద్ధికి స్థానిక సంస్థలకు 14 వేల కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు.
గ్రామ సభలో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి ప్రాతిపదికగా సభలు జరగాలని కోరారు. వివాదాలకు, రాజకీయాలకు ఈ సభలు వేదిక కాకూడదని ఆమె హితవు పలికారు. దర్శి నియోజకవర్గంలో గ్రామసభలలో వచ్చే ప్రతి సమస్యను ఒక నివేదికలాగా రూపొందించి ప్రణాళికబద్దంగా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఆర్జీఎస్ పీడీ వెంకటరమణ, ఎంపీడీవో జనార్దన్ రావు, తదితర అధికారులు, గ్రామ సర్పంచ్ రామాంజి, ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. గంగవరం గ్రామ సభలో ఎంపీడీవో కీర్తి, ఏపీవో, ఈవో పీఆర్ అండ్ ఆర్డీ, ఎంపీపీ తనికొండ శ్రీనివాసరావు, పంచాయితీ కార్యదర్శి, తదితర అధికారులు, సర్పంచ్ నాగమణి, మండల పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామలక్ష్మయ్య, సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే, కొత్తపల్లి సభలో ఎపీడీవో కుసుమ కుమారి, సీడీపీవో భారతి, ఏపీవో తదితర పంచాయతీ అధికారులు, సచివాలయం సిబ్బంది, సర్పంచ్ బట్టు రాము యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రె సుబ్బారెడ్డి, నాయకులు అంబటి గోవిందరెడ్డి తదితర నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.