రైతు బాంధవుడు సీఎం రేవంత్   

 – ఎంపి  మల్లు రవి  

హైదరాబాద్, మహానాడు: రుణమాఫీ అమలు చేసి రైతు బాంధవుడిగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని ఎంపీ  మల్లు రవి  అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని గాంధీ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దఫాలు వారీగా.. లక్ష.. లక్షన్నర.. రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తాం. దేశంలో
ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదు. యూపీఏ హయాంలో 74 వేల కోట్లు.. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తే, ప్రస్తుతం తెలంగాణ లో 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నాం. 8 మంది కాంగ్రెస్ ఎంపీ ల తరుపున సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు. రైతు భరోసా మీద కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ భట్టి,తుమ్మల,పొంగులేటిలతో ప్రభుత్వం వేసింది.

రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ తో పాటు ఐదు హామీలు అమలు చేస్తున్నాం. రైతు బంధు ఇవ్వకుండా.. రుణమాఫీ చేస్తున్నారని హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు 7 నెలలకు గాను.. 29 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. టీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ భూములకు, భూస్వాములకు రైతు బంధు ఇచ్చారని ఎద్దేవా చేశారు.