వాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలి 

వాలంటీర్ల పిటిషనర్ షేక్ సిద్ధిక్ 

అమరావతి, మహానాడు :  గతంలో వాలంటీర్లకు చెల్లించిన వేతనాలను జగన్ నుంచి రాబట్టాలని వాలంటీర్ల పిటిషనర్షేక్ సిద్ధిక్ డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సానుభూతి పరులను,కార్యకర్తలను ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం 5 వేల వేతనాన్ని ఇచ్చి వాలంటీర్లను నియమించారు. వాళ్ళ ద్వారా పథకాలు అమలు చేస్తాం అని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇస్తూ  పార్టీకి పనిచేయించుకున్నారు. వాలంటీర్లు కూడా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ వచ్చారు.

కావున గత అయిదేళ్లుగా వాలంటీర్లకు ఇచ్చిన కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జగన్  నుంచి రాబట్టాలి. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను పునరుద్దరిస్తే ఎన్నికల సమయంలో వైసీపీ నాయకుల మాటలు విని రాజీనామా చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వవద్దని వాలంటీర్లపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేసిన పిటిషనర్ షేక్ సిద్ధిక్ ప్రభుత్వాన్ని కోరారు.