లోకేష్ చొరవతో రంగా, భరతమాత విగ్రహాలకు మోక్షం

జగన్ ప్యాలెస్‌కు అడ్డమని తొలగించిన భరతమాత-వంగవీటి రంగా విగ్రహాలు
రెండు సంవత్సరాల క్రితం తొలగించిన భరతమాత, 8 సంవత్సరాల క్రితం తొలగించిన రంగా విగ్రహానికి మోక్షం
లోకేష్ చొరవపై కాపు సంఘాలు, హిందూ సంస్థల హర్షం
భరతమాత తాడేపల్లికి వచ్చేస్తుంది.. ఇక ఎవరూ ఆపలేరు..!
ఉండవల్లికి ఆత్మగౌరవం రంగా విగ్రహం
నెల రోజుల్లో అధికారికంగా విగ్రహం ఏర్పాటు?
-నారా లోకేష్ వల్లే సాధ్యమైంది అంటున్న స్థానికులు

తాడేపల్లి: జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కు అడ్డుగా ఉందని రెండు సంవత్సరాల క్రితం భరతమాత విగ్రహాన్ని, ఉండవల్లి సెంటర్లో 8 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణ లో భాగంగా రంగా విగ్రహాన్ని తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం ఉదయం ఈ రెండు విగ్రహాలకు అనువైన ప్రదేశాల కోసం మున్సిపల్ అధికారి డిసిపి అశోక్ కుమార్, తాడేపల్లి తెలుగుదేశం టౌన్ అధ్యక్షుడు వెంకటరావుతో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వెంకటరావు మాట్లాడుతూ.. తాడేపల్లి లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్యాలస్ కోసం భరతమాత విగ్రహాన్ని తొలగించడం దారుణమని, అదే విగ్రహన్ని ఇప్పుడు రోడ్డు మధ్యలో నెలకొల్పి ఈ రోడ్డుకు భరతమాత రోడ్డు అని నామకరణం చేయాలని నారా లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు.

ఏది ఏమైనా డైనమిక్ లీడర్ నారా లోకేష్ చొరవ వల్లే, త్వరలోనే తాడేపల్లి టౌన్ రూపురేఖలు మారిపోతాయని… దానికి ఉదాహరణే భరతమాత విగ్రహం. ఉండవల్లి సెంటర్ జంక్షన్ అభివృద్ధి అన్నారు. మరో 30 రోజుల్లో.. యువ నాయకుడు లోకేష్ మార్క్ అభివృద్ధి, తాడేపల్లి తో పాటు మంగళగిరి నియోజకవర్గం మొత్తం చూస్తారని వెంకట్రావు చాలెంజ్ విసిరారు.

అలాగే 2016 లో ఉండవల్లి సెంటర్ లో తొలగించిన రంగా విగ్రహాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కాపు జాగృతి సమర్పించిన పిటిషన్ కు స్పందిస్తూ.. విగ్రహానికి అనువైన ప్రదేశాన్ని మున్సిపల్ అధికారులు సందర్శించారు. ఉండవల్లి సెంటర్ లోని వర్క్ షాప్ కి వెళ్లే దారిలో గల సచివాలయం ఎదురుగా రంగా గారి విగ్రహం ఏర్పాటుతో సహా.. ఉండవల్లి సెంటర్ జంక్షన్ ను నెల రోజుల్లో అభివృద్ధి చేస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు హామీ ఇచ్చారు.

అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ.. ఇప్పటికే పూర్తిస్థాయిలో రంగా విగ్రహ కమిటీ ఏర్పాటు చేశామని, కాపు జాగృతి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న రాజేష్ తెలిపారు.

ఈ విషయంపై నారా లోకేష్, చిల్లపల్లి శ్రీనివాసరావు లకు రిప్రజెంటేషన్లు కూడా అందజేశామని, వంగవీటి రాధా సైతం త్వరితగతిన రంగా విగ్రహాన్ని ఉండవల్లి సెంటర్లో ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు.
ఉండవల్లికి ఆత్మగౌరవం అయిన రంగా విగ్రహాన్ని పునర్ నిర్మించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే లోకేష్ చొరవ చూపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.