సంబరాల రాంబాబు ఓటమి తథ్యం

ఆయన చేష్టలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది
కన్నా ప్రజా పోరాటాలకు మద్దతుతో మేలు జరిగింది
టీడీపీ రాష్ట్ర నాయకుడు కొర్రపాటి సురేష్‌

సత్తెనపల్లి, మహానాడు : ఐదేళ్లుగా వైసీపీ దుర్మార్గాలను అరికట్టేందుకు ఆయా వర్గాలకు ప్రజాగళమై అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం వల్ల ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు జరిగిందని టీడీపీ రాష్ట్ర నాయకుడు కొర్రపాటి సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భంలో అంబటి రాంబాబు చేష్టలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. మంత్రిగా పోలవరం పూర్తి చేయలేదని, రాష్ట్రంలో కనీసం ప్రాజెక్టులు సందర్శించలేదన్నారు. ఎమ్మెల్యేగా సత్తెనపల్లి గ్రామాల్లో పంచాయతీ నిధులు జగన్‌ స్వాహా చేస్తే నోరుమెదపకుండా పేదల వద్ద చందాలు వసూలు చేసి సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి ప్రజలంతా అంబటి రాంబాబును డిపాజిట్లు గల్లంతయ్యేలా ఓడిరచి సంబరాలు చేసుకునేం దుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.