– మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
విజయవాడ, మహానాడు: ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావడానికి 10 వేల మంది కార్మికులు అవసరమని, నీరు తగ్గిన తర్వాత రోడ్లపై మురుగు లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గిన తర్వాత చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనులపై మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రి ఏమన్నారంటే.. వరద ముంపు ప్రాంతాల్లో ఎంతో కష్టపడి బాధితులను బయటికి తీసుకొచ్చాం.. దాదాపు బాధితులందరికీ ఆహారం అందేలా ఏర్పాట్లు చేశాం. ఇవాళ 8.5 లక్షల ఫుడ్ ప్యాకెట్లు టిఫిన్ కోసం, మరో 8.5 లక్షల అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశాం. 5 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల కమిషనర్లకు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. ఒక్కో సచివాలయానికి ఒక్కో ప్రత్యేకాధికారి ఉంటారు. వరద నీరు తగ్గగానే ఫైర్ డిపార్ట్మెంట్ తో కలిసి ట్యాంకర్ల తో రోడ్లు శుభ్రం చేస్తాం… బ్లీచింగ్, ఫాగింగ్ పనులు వెంటనే చేపడతాం. వైద్యారోగ్య శాఖతో కలిసి మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.