– విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ రమేష్
గుంటూరు, మహానాడు: ప్రభుత్వ యంత్రాంగం.. నిస్వార్ధంగా పనిచేసిన దివంగత ఎస్ఆర్ శంకరన్ అడుగుజాడల్లో నడవాలని విశ్రాంత స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేష్ పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన ఎస్ఆర్ శంకరన్ 14 వ వర్ధంతి సభకు రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సభకు జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. రమేష్ ప్రసంగిస్తూ శంకరన్ జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులు, గిరిజనులు,పేదల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్, రెడ్ క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు పి. రామచంద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.