అమరావతి, మహానాడు : ఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. డీజీపీ నియామకంపై ఎన్నికల కమిషన్ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు బాగ్చీ ఆ పదవిలో కొనసాగనున్నారు.