ఆయన ఇంటికి వెళ్లిన తెలుగు విద్యార్థి నేతలు
సుకన్య, సంజనాలతో ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
అడ్డుకున్న పోలీసులు…సత్తెనపల్లిలో ఉద్రిక్తత
సత్తెనపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు విద్యార్థి నేతలు ఆయనకు చీర, జాకెట్, పూలు ఇచ్చేందుకు వెళ్లారు. సుకన్య, సంజనాలతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పలికేందుకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అంబటి ఇంటి ముందు వాటిని కుర్చీలో పెట్టి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగు విద్యార్థి జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీ, రాయపాటి అమృతరావు తదతరులు పాల్గొన్నారు.