విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులకు తమ వంతు సహాయం అందించిన సాత్విక్, ఆయన తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ అభినందించారు.