– జిల్లా సభ్యత్వ పరిశీలకుడు పాలపాటి రవికుమార్
గుంటూరు, మహానాడు: అరండల్ పేట 15వ లైన్ లోని ఎస్సీ మోర్చా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గుంటూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ ధారా అంబేద్కర్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా సభ్యత్వ పరిశీలకుడు పాలపాటి రవికుమార్ హాజరై, ఏమన్నారంటే.. దేశ ప్రజలందరూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం మూడోసారి కోరుకొని అధికారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. బిజెపిలో పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేపట్టాలి. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ధారా అంబేద్కర్ మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం ఆధారంగా సమాజంలోని అట్టడుగు స్థాయికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్ని చేరువయ్యే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని అన్నారు.
భవిష్యత్తులో సభ్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతామని అన్నారు. నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని ‘సేవ పట్వాడా’ కార్యక్రమంలో భాగంగా పేదలకు కూరగాయలు, బిస్కెట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చెరుకూరు తిరుపతిరావు, చరక కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు భగవాన్ దాస్, రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్, జల్ది మోహన్, జిల్లా ఆర్టిఐ సెల్ కన్వీనర్, బూసి స్టాలిన్ బాబు, కొరివి నాగరాజు, మహిళా నాయకులు రమణ, దుర్గ, నాలుగో మండలం ప్రధాన కార్యదర్శి పెద్దింటి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.