ఎసెన్షియ కంపెనీని సీజ్ చేయండి

– భద్రతా లోపాలు ఉన్న ప్లాంట్లను మూసేయండి
– ఏపీ సీసీ చీఫ్ షర్మిలా రెడ్డి డిమాండ్

విజయవాడ, మహానాడు: అచ్యుతాపురం మృత్యుఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు, అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయి జనాల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా..? అని ఏపీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి అన్నారు. గత ఏడాడి చివరిలోనే ‘ఎసెన్షియా ఫార్మా’ నిర్వాహకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి.

కానీ అప్పటి సర్కారు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుండి ఏమి నేర్చుకోకుండా, ఎదురు ఈ రిపోర్టుపై మౌనం వహించింది. పట్టుమని పాతిక కిలోమీటర్ల దూరంలో కొండను పిండి చేసి రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు, తీరిక ఉంటాయి. కానీ కార్మికుల ప్రాణాలంటే మాత్రం లెక్క లేదు…. కూటమి సర్కారును మేం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎసెన్షియా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దారుణాలు, మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలి. ఎక్కడ భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలని డిమాండ్‌ చేశారు.