Mahanaadu-Logo-PNG-Large

పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపులు

శ్రీకాకుళం, మహానాడు: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న ఓ విద్యార్థి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా… లైంగిక వేధింపులపై స్పందించకపోవడంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. తక్షణమే ఆ విద్యార్థి పై చట్టపరంగా చర్యలు తీసుకుని ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.