విజయవాడ వరద ముంపు బాధితులకు అండగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నిలిచింది. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచన మేరకు ఆయన భార్య ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సహకారంతో గురువారం వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేస్తున్నారు.