బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి షాక్

– బఫర్ జోన్ లో అనురాగ్ యునివర్సిటీ
– వెంకటాపురం, నాదం చెరువు బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ
– కేసు నమోదు

మేడ్చల్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బఫర్ జోన్ లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా లోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. చెరువును కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కళాశాల భారీ నిర్మాణం చేపట్టారని ఏఈ పరమేశ్వర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏఈ పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.